Site icon vidhaatha

నెల్లూరు రూరల్ ఇంచార్జిగా ఆదాల.. ఆఘమేఘాల మీద నిర్ణయం..!

విధాత‌: ముఖ్యమంత్రి జగన్ కొన్ని విషయాల్లో జెట్ స్పీడ్ తో నిర్ణయాలు తీసుకుంటారు. తనను ఇగ్నోర్ చేసినా, ఎదురు తిరిగినా క్షణకాలం కూడా ఉపేక్షించడం ఉండదు. వెనువెంటనే వాళ్ళను వదిలించుకుని కొత్తవాళ్లకు అక్కడి బాధ్యతలు అప్పహిస్తుంటారు.

వెంకటగిరిలో ఎదురు తిరిగినఆనం రామనారాయణ రెడ్డి స్థానంలో నేదురుమల్లి రామ్ కుమార్ ను అక్కడ ఇంచార్జ్ గా నయమించారు . నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం టిడిపి వైపు వెళ్లే సూచనలు కనిపించడంతో అక్కడ నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇంచార్జ్ గా వేసేశారు.

నెల్లూరు జిల్లా పరిణామాలపై జగన్.. ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులతో చర్చలు జరిపారు. నెల్లూరురూరల్ వ్యవహారాన్ని గమ్మున తేల్చి పారేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమిస్తూ వెంటనే ఆదేశాలు వచ్చాయ్.

మరోవైపు పార్టీకి డ్యామేజ్ చేసే స్థాయి కోటంరెడ్డికి లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. జగన్ దయతోనే కోటంరెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాడన్నారు. జగన్ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళే గెలుస్తారన్నారని తేల్చిచెప్పారు. వాస్తవానికి అది ఫోన్ ట్యాపింగ్ కాదని, శ్రీధర్ రెడ్డి ఫోన్ సంభాషణ ఆయన మిత్రుడే రికార్డ్ చేసి బయటపెట్టారని అన్నారు.

Exit mobile version