Adilabad
విధాత, ఆదిలాబాద్ ప్రతినిధి: ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలం సీతగోంది గ్రామం సమీపంలో యువతి యువకుడు మృతి చెందడం కలకలం రేపింది. సీతగోంది గ్రామ శివారులో ఓ వ్యవసాయ భూమిలో జంట విగత జీవులుగా కనిపించారు. మృతులు రెహమాన్, అశ్వినిగా గుర్తించారు.
అశ్వినికి ఇదివరకే పెళ్లి అయినట్లు సమాచారం. గత రెండు రోజుల క్రితం అదిలాబాద్ పట్టణం నుండి బైక్ పై సీత గొంది వైపు వస్తున్న దృశ్యాలు సిసి ఫుటేజ్ లో నిక్షిప్తమయ్యాయి. రెండు రోజుల క్రితం మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.
వీరిని ఎవరైనా హత్య చేశారా ? వారే ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో పోలీసులు జాగిలాలను రప్పించి ప్రమాద స్థలంలో విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో నిజ నిజాలు వెలుగు చూడనున్నాయి.