Adipurush OTT | కబురు కూడా వేస్ట్ అనుకున్నారా..? కామ్‌గా దింపేశారు

Adipurush OTT | రాముడి మీద సినిమా అంటే అది తెలిసిన కథే అయినా రామ భక్తులు ఎంత ఆత్రంగా ఎదురు చూస్తారో తెలియని విషయమేమి కాదు. అలాగే అంతే ఉత్సాహంతో సినిమాను ఇష్టపడే ప్రేక్షకుడు కూడా రాముని పాత్ర కోసం, అందులోనూ నచ్చిన హీరో రాముని పాత్రలో నటిస్తున్నాడంటే ఆ ఫీల్ వేరే లెవల్లో ఉంటుంది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఆదిపురుష్’ విడుదలైన మొదటివారంలో భారీ కలెక్షన్స్ రాబట్టినా, తర్వాత వారానికల్లా ప్లాప్‌గా […]

  • Publish Date - August 12, 2023 / 05:40 PM IST

Adipurush OTT |

రాముడి మీద సినిమా అంటే అది తెలిసిన కథే అయినా రామ భక్తులు ఎంత ఆత్రంగా ఎదురు చూస్తారో తెలియని విషయమేమి కాదు. అలాగే అంతే ఉత్సాహంతో సినిమాను ఇష్టపడే ప్రేక్షకుడు కూడా రాముని పాత్ర కోసం, అందులోనూ నచ్చిన హీరో రాముని పాత్రలో నటిస్తున్నాడంటే ఆ ఫీల్ వేరే లెవల్లో ఉంటుంది.

అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఆదిపురుష్’ విడుదలైన మొదటివారంలో భారీ కలెక్షన్స్ రాబట్టినా, తర్వాత వారానికల్లా ప్లాప్‌గా నిలిచింది. రాముడి పాత్రలో ప్రభాస్ బాగానే కనిపించినా, సీత పాత్రకు తగినట్టుగా కృతి సనన్ నప్పలేదని, రావణుడిగా సైఫ్ ఆలీఖాన్ నటన అసలు బాగాలేదనే వ్యతిరేకత వినిపించింది. మరీ ముఖ్యంగా ఓం రౌత్‌పై ఒక యుద్ధమే జరిగింది.

భారీ అంచనాలతో అంతకన్నా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రభాస్ బాహుబలి సిరీస్ తర్వాత అతనికి గొప్ప విజయాన్ని తెచ్చిపెడుతుందనే అంతా అనుకున్నారు కానీ.. ఇందులో కథ, కథనాలను, డైలాగ్స్ కూడా దర్శకుడు ఓం రౌత్ తనకు నచ్చినట్టుగా మార్చేయడంతో ఆదిపురుష్ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.

అంతే గాటుగా విమర్శలూ అందుకుంది. ఆ తర్వాత కూడా ఆదిపురుష్‌ని వివాదాలు వదల్లేదు.. తెలిసిన కథలోనే చాలా మార్పులు చేసి ప్రయోగాలతో మొత్తం చెడగొట్టాడు ఓం రౌత్. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు రచయితగా పని చేసిన మనోజ్ ముంతాషీర్ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు.

ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ వరుసగా మూడో ప్లాప్ అందుకున్నాడు. దాదాపు 600 కోట్లతో ఏం తీయాలను కుని ఎటువంటి సినిమా తీసారనే విమర్శల మధ్య.. జూన్ 16న విడుదలైన ఆదిపురుష్ వెంటనే ఓటీటీకి వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అక్కడ కూడా కాస్త సస్పెన్స్ నడిచింది. అయితే మేకర్స్ అసలు కబురనేది లేకుండా.. కామ్‌గా ఓటీటీలోకి సినిమాని దింపేశారు.

అయితే ఓటీటీలో కూడా ఈ సినిమాకు అనుకున్నంత స్పందన రావడం లేదని తెలుస్తోంది. కనీసం కాస్త సమాచారం ఇచ్చినా.. ఏమైనా ఉపయోగం ఉండేదేమో. ఇక 600 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 400 కోట్ల వరకూ వసూలు చేసినట్లుగా ట్రేడ్ రిపోర్ట్ ప్రకటించాయి. సినిమా నిర్మాణ పరంగా భారీ నష్టాలనే చవి చూసింది.

ఈ కారణాల మధ్య సతమతమైన ఈ సినిమా బడా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం వారానికి ఓ డజను సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి.. అలాగే ఈ సినిమా కూడా వచ్చింది తప్ప.. స్పెషల్‌ అయితే ఏం లేదు అనేలా.. ఆదిపురుష్ ఓటీటీ రిలీజ్ గురించి మాట్లాడు కుంటుండటం గమనార్హం.

Latest News