Site icon vidhaatha

అనసూయ భలే ఓవర్ చేస్తోంది.. సుధీర్‌ని.. అంత మాట అనేసిందేంటి?

విధాత‌: నిజానికి ప్రేక్షకులు, సినిమా వారు ఎందుకో తెలియదు గానీ అనసూయ భరద్వాజ్ వంటి వారిని నెత్తిమీద పెట్టుకుని ఓ షబానా అజ్మీ లేదా సుస్మితసేన్ తరహాలో ఊరేగిస్తుంటారు. కానీ నిజానికి ఆమెకి అంత సీన్ లేదు. కేవలం బుల్లితెర మీద కనిపిస్తూ ఇద్దరు పిల్లలు కలిగిన వయసులో కూడా తన అందచందాలతో ఆకట్టుకుంటూ ఏదో పైకి వచ్చిందని కాస్త అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. అది ఆమె అదృష్టమే గాని.. ఆమెను మించిన టాలెంట్ లేక కాదు.

నిజానికి సుమ ముందు అనసూయ భరద్వాజ్ ఎంత…? సుమకు సరైన ఫిజిక్‌ లేదనే గాని అనసూయ ఆమె టాలెంట్ ముందు కాలి గోటికైనా పనికొస్తుందా? మనవారు మరీ ఓవర్. కాస్త నచ్చింది అంటే చాలు నెత్తిన పెట్టి ఊరేగిస్తారు. చిన్న తేడా వచ్చిందంటే అథః పాతాళానికి తోసేస్తారు. అనసూయ భరద్వాజ్ వంటి వారు అవకాశాలు లేక ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.

కానీ అదృష్టం కొద్దీ ఆమె బుల్లితెరపై వెలుగు వెలిగి చాలామందితో బాగా స‌న్నిహితంగా మెలుగుతూ పరిచయాలు పెంచుకుంది. అదే ఆమెకు నేడు అవకాశాలు తెచ్చిపెట్టుతోంది. మరో రెండు మూడు కరోనాలు వచ్చాయంటే వీరి నెత్తి పొగరు నేలకి దిగడం పెద్ద పని కాదు. మ‌రో నాలుగైదు చిత్రాల‌కు ప్రేక్ష‌కులకు మొహం మొత్తితే అంతా గోవిందా….! ఆమేం అభిన‌వ సావిత్రి కాదు.

మ‌హాన‌టి సావిత్రినే కొంత‌కాలం దుర్భ‌ర జీవితం గ‌డిపిన విష‌యం మ‌ర్చిపోకూడ‌దు. సినిమా అనేది రంగుల‌, ఊహ‌ల ప్ర‌పంచం. ఎప్పుడు పైన ఉంటామో.. ఎందుకు ప‌డిపోతామో ఎవ్వ‌రు చెప్ప‌లేరు. ఉదయభాను, ఝాన్సీ సంగతి ఏమైందో తెలుసు కదా..! వారు ఈమె కంటే టాలెంట్ గలిగినవారు. కానీ పరిస్థితులు అంతే. ఓడలు బండ్లు అవుతాయి…. బండ్లు ఓడలవుతాయి.

అనసూయ యాటిట్యూడ్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంది. నిజానికి విజయ్ దేవరకొండ, అనసూయ భరద్వాజ్ వంటి యాటిట్యూడ్ ఉన్నవారికి మనం ప‌ట్టం కట్టడం ఎంతవరకు సమంజసం. అదేమంటే రౌడీ స్టార్ అని విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ని, ఫైర్‌ బ్రాండ్ అంటూ అన‌సూయ‌కు బిరుదులు ఇస్తున్నారు.

సాధారణంగా మగవారి కంటే ఆడవారికి సినిమా చాన్సులు ఎక్కువగా వస్తాయి. దానికి కారణాలు అనేకం. అందులో ఎక్స్‌పోజింగ్ కూడా ఒకటి. ఈ మధ్య అనసూయ భరద్వాజ్‌కు గర్వం కూడా తలకెక్కినట్టుగా స్పష్టంగా అర్థం అవుతుంది.

సుడిగాలి సుధీర్‌తో పనిచేశారు కదా! ఆ అనుభవం ఎలా ఉంది… అని రిపోర్టర్ అడిగితే అతడు నాకంటే జూనియర్… అంటూ అవాకులు చవాకులు పేలింది. ఈమె ఇప్పుడు బుల్లితెర షోస్‌కి యాంకరింగ్ మానేయవచ్చు. కానీ రేపటి రోజున అవే ఆమె దిక్కు కావచ్చు.

మనం ఎంత ఎదిగినా మూలాలు మర్చిపోకూడదు. ప్రస్తుతం అనూసూయ‌ భరద్వాజ్ బహుశా తనకు తాను పెద్ద స్టార్ హీరోయిన్‌లా ఫీల్ అవుతున్నట్టు ఉంది. సుడిగాలి సుధీర్ నా జూనియర్ అనేసింది. జూనియర్ అన‌డంలో ఎలాంటి తప్పులేదు. కానీ ఆమె చెప్పిన తీరు, సందర్భమే ఇక్కడ కాస్త తేడాగా ఉంది.

ఓ ఈవెంట్‌లో పాల్గొన్న అనసూయను రిపోర్టర్ మీరు యాంకర్‌గా సుధీర్‌తో పనిచేశారు. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అని అడిగారు. దాంట్లో తప్పేమీ లేదు. కానీ అనసూయ మాత్రం సుధీర్‌తో పనిచేసిన అనుభవం గురించి అడిగితే బాగా హర్ట్ అయ్యారు. అది మనసులో దాచుకోకుండా బయటపడ్డారు.

సుధీర్ నాకంటే జూనియర్. ఆ విషయం మర్చిపోయారా? నాతో పని చేసిన అనుభవం ఎలా ఉందో సుధీర్‌ని అడగాలి గానీ.. ఆయనతో పనిచేయడం ఎలా ఉందో నన్ను అడక్కూడదు అని షాక్ ఇచ్చింది. ఆ తర్వాత సుధీర్ హార్డ్ వర్కింగ్, టాలెంటెడ్ అంటూ కాస్త వెన్న‌పూత రాయాల‌ని, కూల్‌ చేయాలని ప్రయత్నించింది.

అసలు ఆ సందర్భంలో ఎవరు జూనియర్ ఎవరు సీనియర్ అనే ప్రస్తావనే రాలేదు. జస్ట్ ఆయనతో పనిచేసిన అనుభవం గురించి అడిగారు అంతే. అనసూయ అసందర్భంగా ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ మాటకు వస్తే సుడిగాలి సుధీర్ ఫ్యాన్ బేస్ ఆమె కంటే చాలా ఎక్కువ. ఆమె హీరోయిన్‌గా ఒక్క సినిమా చేసిన హిట్ కాలేదు.

కానీ సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు చిత్రం టాక్ బాగా లేకపోయినా సూపర్ హిట్ అయింది. మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఆయనతో సోలో చిత్రం చేస్తే 20 కోట్ల దాకా షేర్ రావడం ఖాయం అనేలా ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. అలాంటి సుధీర్‌ని పట్టుకుని పరోక్షంగా అనసూయ నా ముందు బచ్చ అనేసింది. ఆ నోటి దూలే అనసూయను వివాదాల్లోకి నెట్టుతోంది.

లైగర్ మూవీ ఫ్లాప్ అయినప్పుడు సంబరాలు ప‌డ‌టం సరికాదు. మానిపోయిన పుండును మరలా తిరగ తోడ‌టం దేనికి? ఇక మా ఎలక్షన్స్ లో ఈమె ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. ఇది ఎవరిని అడిగినా చెప్తారు. సో అనసూయ భరద్వాజ్ ఎలా మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనుకోవడం పొరపాటు. ఆమె మహిళ కావున చాలామంది సానుభూతి రావచ్చు.

పోలీసులు, చట్టం ఆమెకు చుట్టం కావచ్చు. అంతమాత్రాన ఎవరిని ప‌డితే వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదు. ముఖ్యంగా ఈ టైమ్‌లో ఆమె ఎంత ఒదిగి ఉంటే.. అంత మంచి పాత్రలు ఆమెను వరిస్తాయని మాత్రం మరిచిపోకూడదు.

Exit mobile version