విధాత: నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని మొదటి అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ(Anganwadi) టీచర్‌గా పని చేస్తున్న ఐ.దానమ్మ సోమవారం తెల్లవారుజామున గుండెపోటు(Heart Attack )తో మృతి చెందారు. ఆదివారం అస్వస్థతకు గురైన దానమ్మను హైదరాబాద్(Hyderabad)కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా బంధువులు తెలిపారు.
1986లో అంగన్వాడీ టీచర్‌గా నియమించబడి సుమారు 32 సంవత్సరాలు సేవలందించారు. ఐసీడీఎస్(ICDS), సీడీపీఓ(CDPO) గంధం పద్మావతి, సూపర్వైజర్లు గౌస్యవేగం, వెంకాయమ్మ, సరిత, రాజ రాజేశ్వరి, రమాదేవి, అంగన్వాడి టీచర్ల సంఘం నాయకులు సైదమ్మ, మణెమ్మ, స్థానిక అంగన్వాడీ టీచర్లు దానమ్మ మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.