Anil Ravipudi | ఏంద‌య్యా బ్ర‌హ్మాజీ.. ఇలా అనీల్ రావిపూడి మెడ మీద క‌త్తి పెట్టి బెదిరిస్తున్నావ్..!

Anil Ravipudi: ఇటీవ‌ల కాలంలో సినిమా ప్ర‌మోషన్స్ కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. సినిమాని జ‌నాల‌లోకి తీసుకెళ్లేందుకు మేక‌ర్స్ విచిత్ర ప్ర‌యోగాలు చేస్తున్నారు. ఒక్కొక్క‌రు ఒక్కో స్టైల్‌లో సినిమాని జ‌నాల‌లో తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా బ్ర‌హ్మాజీ త‌న కొడుకు సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఏకంగా అనీల్ రావిపూడి మెడ‌పై క‌త్తిపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. వివ‌రాల‌లోకి వెళితే బ్ర‌హ్మాజీ త‌న‌యుడు సంజ‌య్ రావు హీరోగా రూపొందిన చిత్రం `స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌` . ఈ […]

  • Publish Date - July 24, 2023 / 07:35 AM IST

Anil Ravipudi: ఇటీవ‌ల కాలంలో సినిమా ప్ర‌మోషన్స్ కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. సినిమాని జ‌నాల‌లోకి తీసుకెళ్లేందుకు మేక‌ర్స్ విచిత్ర ప్ర‌యోగాలు చేస్తున్నారు. ఒక్కొక్క‌రు ఒక్కో స్టైల్‌లో సినిమాని జ‌నాల‌లో తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా బ్ర‌హ్మాజీ త‌న కొడుకు సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఏకంగా అనీల్ రావిపూడి మెడ‌పై క‌త్తిపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. వివ‌రాల‌లోకి వెళితే బ్ర‌హ్మాజీ త‌న‌యుడు సంజ‌య్ రావు హీరోగా రూపొందిన చిత్రం ‘స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌’ . ఈ మూవీ జూలై 29న విడుదల కాబోతుంది.

ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోసం ప‌లువురు స్టార్స్ సాయం కోరుతున్నాడు బ్ర‌హ్మాజీ. ఇప్ప‌టికే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌, ఇతర ప్రమోషన్స్ కార్యక్రమాల్లో త‌న స‌పోర్ట్ అందించిన అనీల్ రావిపూడిని ఇప్పుడు రిలీజ్ డేట్ చెప్ప‌మని బ్ర‌తిమిలాడాడు బ్ర‌హ్మాజీ. కాని అత‌ను షూటింగ్ ప‌నుల‌తో బిజీగా ఉన్నా, చెప్ప‌ను పో అని అన్నాడు. దాంతో క‌త్తితో బెదిరించి జూలై 29న సినిమా విడుద‌ల కాబోతుంద‌ని చెప్ప‌మ‌న్నాడు. వెంట‌నే అనీల్ రావిపూడి జూలై 29న సినిమా రిలీజ్ అవుతుంద‌ని చెప్పి, బ్ర‌హ్మాజీ చేతిలో ఉన్న క‌త్తిని తీసుకున్నాడు. ఇది సినిమా ప్ర‌మోష‌న్స్ కి ప‌నికొస్తుంద‌ని దాచాడు.

జస్ట్ ఫన్‌, అండ్‌ ప్రమోషన్స్ కోసం చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చల్ చేస్తుంది. ఇక ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ చిత్రం విష‌యానికి వ‌స్తే ఇందులో సంజయ్ రావు, ప్రణవి మానుకొండ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌గా, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు అయిత‌న డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. కంప్లీట్ కామికల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సప్తగిరితో పాటు పలువురు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 21నే విడుదల కావాల్సి ఉండగా, అనుకోని కారణాలతో ఈ నెల 29కి వాయిదా ప‌డింది.

Latest News