Site icon vidhaatha

Kanna Rao | కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు నమోదు

విధాత : మాజీ సీఎం, బీఆరెస్‌ అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావుపై మరో కేసు నమోదైంది. ఆయనతో పాటు ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను బెదిరించి డబ్బు తీసుకున్నట్లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి విజయవర్ధన్ రావు వారిపై ఫిర్యాదు చేశాడు. తాను ఓ సమస్య పరిష్కారం కోసం వెళితే తనను గెస్ట్‌హౌస్‌లో నిర్భంధించి దాడి చేశారని, కన్నారావుకు పరిచయస్తురాలైన నందిని సహా మరికొందరు కలిసి తన నుంచి రూ.60 లక్షల నగదు. 97 తులాల బంగారం దోచుకున్నాడని ఫిర్యాదులలో పేర్కోన్నాడు. తనకు పోలీసు అధికారి భుజంగరావు, ఏసీపీ కట్టా సాంబయ్య తెలుసంటూ కన్నారావు బెదిరించాడని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలే కన్నారావుపై మన్నెగూడ భూవివాదంలో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Exit mobile version