Site icon vidhaatha

ఎంపీ రఘురామకు ఏపీ సీఐడీ నోటీసులు

హైదరాబాద్‌: విచారణకు హాజరుకావాలంటూ ఏపీ సీఐడీ అధికారులు తనకు నోటీసులు ఇచ్చారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. దీనిపై ఈనెల 16న తాను సమాధానం ఇచ్చినట్లు చెప్పారు.

హైదరాబాద్‌లో విచారణకు తనతో పాటు రెండు ప్రముఖ ఛానళ్లకు కూడా నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఉన్నాయన్నారు.

అయినా తన ఒక్కడికే నోటీసులు ఇచ్చారని.. ఇది కోర్టు ధిక్కరణ అవుతుందని తెలిపారు. ఇదే విషయాన్ని ఏపీ సీఐడీకి ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నట్లు రఘురామ తెలిపారు.

Exit mobile version