Site icon vidhaatha

డబుల్ దరఖాస్తు గడువు పెంచాలి: BLR ధర్నా

విధాత: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దరఖాస్తులకు గడువు పెంచాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ బీసీలకు కుల దృవీకరణ పత్రాల జారీలో ఆన్‌లైన్‌లో తీవ్ర జాప్యం జరుగుతున్నందునా దరఖాస్తుల గడువు పొడిగించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం అర్హులైన పట్టణంలోనే పేద వర్గాలు అందరికీ డబుల్ బెడ్ రూమ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బత్తుల బ్రదర్స్ తో పాటు స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు,బాధిత ప్రజలు పాల్గొన్నారు.

Exit mobile version