Ashish Vidyarthi | 60 ఏండ్ల వ‌య‌సులో రెండో పెళ్లి చేసుకున్న ప్ర‌ముఖ న‌టుడు.. వ‌ధువు ఎవ‌రంటే..?

Ashish Vidyarthi | ప్ర‌ముఖ న‌టుడు ఆశిష్ విద్యార్థి 60 ఏండ్ల వ‌య‌సులో రెండో పెళ్లి చేసుకున్నాడు. అసోంలోని గువాహ‌టికి చెందిన ఫ్యాష‌న్ ఎంట్ర‌ప్రెన్యూర్ రూపాలీ బ‌రువాను వివాహ‌మాడారు. ఆశిష్, రూపాలీ రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకోగా, ఇరు కుటుంబాల స‌భ్యులు, కొద్ది మంది అతిథులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. రూపాలీని వివాహం చేసుకోవ‌డం, ఆమెతో కొత్త జీవితాన్ని ప్రారంభించ‌డం ఓ అద్భుత‌మైన ఫీలింగ్ అంటూ ఆశిష్ సంతోషం వ్య‌క్తం చేశాడు. ఆశిష్‌, రూపాలీ వివాహ వేడుక ఫోటోలు సోష‌ల్ […]

  • Publish Date - May 26, 2023 / 05:23 AM IST

Ashish Vidyarthi | ప్ర‌ముఖ న‌టుడు ఆశిష్ విద్యార్థి 60 ఏండ్ల వ‌య‌సులో రెండో పెళ్లి చేసుకున్నాడు. అసోంలోని గువాహ‌టికి చెందిన ఫ్యాష‌న్ ఎంట్ర‌ప్రెన్యూర్ రూపాలీ బ‌రువాను వివాహ‌మాడారు. ఆశిష్, రూపాలీ రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకోగా, ఇరు కుటుంబాల స‌భ్యులు, కొద్ది మంది అతిథులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు.

రూపాలీని వివాహం చేసుకోవ‌డం, ఆమెతో కొత్త జీవితాన్ని ప్రారంభించ‌డం ఓ అద్భుత‌మైన ఫీలింగ్ అంటూ ఆశిష్ సంతోషం వ్య‌క్తం చేశాడు. ఆశిష్‌, రూపాలీ వివాహ వేడుక ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. సినీ ప్ర‌ముఖులు, ఆయ‌న అభిమానులు, నెటిజ‌న్లు వారికి శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

సుమారు 20 ఏండ్ల క్రితం న‌టి శాకుంత‌ల బ‌రూవా త‌నయ రాజోషిని ఆశిష్ పెళ్లి చేసుకున్నాడు. ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల ఇద్ద‌రూ విడిపోయారు. ఈ క్ర‌మంలో రూపాలీ వ‌ద్ద ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్త స్నేహంగా మారి ప్రేమ‌గా చిగురించింది. పెళ్లి పీట‌లెక్కింది.

ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆశిష్ 1991లో కాల్ సంధ్య అనే హిందీ చిత్రంతో తెరంగ్రేటం చేశారు. పాపే నా ప్రాణం మూవీతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టారు. గుడుంబా శంక‌ర్, అతిథి, తుల‌సి, పోకిరి, ల‌క్ష్యం, అలా మొద‌లైంది, నాన్న‌కు ప్రేమ‌తో వంటి ఎన్నో సూప‌ర్‌హిట్ చిత్రాల్లో విభిన్న పాత్ర‌ల‌తో అల‌రించి, మెప్పించారు. క‌న్న‌డ‌, త‌మిళ్, మ‌ల‌యాళం, బెంగాలీ, ఒడియా, ఇంగ్లీష్ సినిమాల్లో న‌టించిన ఆశిష్ విద్యార్థి త‌న కేరీర్ ప్రారంభంలోనే 1995లో జాతీయ అవార్డు అందుకున్నాడు.

Latest News