Ashwin Magic Spin
విధాత: భారత్ వెస్టెండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మంచి రసకందాయంలో పడింది. ఆతిథ్య జట్టు కెప్టెన్ బ్రాత్‌వైట్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటంతో టీ బ్రేక్ సమయానికి వెస్టెండీస్ 174 కి 3 వికెట్లతో పోటీ నిచ్చే స్థానంలో నిలబడింది.
తొలి టెస్టులో పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న వెస్టెండీస్(West Indies) కెప్టెన్ బ్రాత్‌వైట్ ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. తన దుర్భేధ్యమైన డిఫెన్స్‌తో బౌలర్లకు చెమట్లు పట్టించాడు. అతను హాఫ్ సెంచరీ చేయడానికి 170 బంతులు తీసుకున్నాడంటే అర్థం చేసుకోవచ్చు ఎలా బ్యాటింగ్ చేశాడో. సెంచరీకి దగ్గరవుతున్నాడని భావిస్తున్న దశలో భారత స్పిన్నర్ అశ్విన్ (Ashwin) తన అనుభవాన్ని రంగరించి ఒక బాల్‌ని సంధించాడు.
Ashwin’s wizardry✨ breaks through Brathwaite’s resistance!#WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/wJz8Ut3tX8
— JioCinema (@JioCinema) July 22, 2023
దీనికి బ్రాత్‌వైట్ అయోమయానికి గురై షాట్ సెలక్షన్‌ను తప్పుగా అంచనా వేయడంతో బ్యాట్, ప్యాడ్‌కు మధ్య ఉన్న ఇరుకైన ఖాళీలోంచి బంతి దూసుకెళ్లి వికెట్లను గిరాటేసింది. దీంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారింది.
బంతి మంచిగా టర్న్ అవుతూ సరైన ఫ్లైట్ తీసుకుని.. వికెట్ల వైపు కదిలింది. ప్యాడ్ ముందుకు బ్యాట్‌ను తెచ్చి డిఫెన్స్ ఆడాలనుకున్నతన నిర్ణయం తప్పని బ్రాత్‌వైట్‌కు తెలిసేలోపే వికెట్లు నేలకూలాయి. అతడు కూడా ఒక్క సెకను ఆశ్చర్యానికి గురై పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. మొత్తం 235 బంతులాడి 75 పరుగులు చేసి జట్టును సురక్షిత స్థాయిలో నిలబెట్టాడు.