విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: దేశ ఐక్యత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం “భారత్ జోడో యాత్ర” చేపట్టడం, అదానీ, మోడీ చీకటి స్నేహం పై నిలదీయడాన్ని తట్టుకోలేక ప్రధాని మోడీ రాహుల్ పై అనర్హత వేటుకు పాల్పడ్డారని ములుగు ఎమ్మెల్యే జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సీతక్క విమర్శించారు.
రాహుల్ గాంధీ పై అనర్హత వేటు భారత ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు గొడ్డలిపెట్టుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంట్ వేదికగా పోరాటం చేయడం ప్రధాని మోడీకి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయన్నారు.
ఈ కుట్రను ప్రజాబలంతో, న్యాయపోరాటం ద్వారా కాంగ్రెస్ ఛేదిస్తుందన్నారు.