Site icon vidhaatha

BANDI SANJAY l బండి సంజయ్‌కి చేదు అనుభవం.. గిర్ని తండాలో నిలదీసిన గ్రామస్తులు

Bad experience for Bandi Sanjay..

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేఎంసి మెడికో డాక్టర్ ప్రీతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు చేదు అనుభవం ఎదురయింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండాలోని ప్రీతి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన ఆదివారం సహచర పార్టీ నాయకులతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బండి సంజయ్‌ని అడ్డుకొని నిలదీశారు. ఈ పరామర్శలతో ఒరిగేదేమీ లేదని అన్నారు.

ప్రీతి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం ఏం సహాయం చేసిందని ప్రశ్నించారు. మాటలతో కాలం వెళ్లదీయకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ మేరకు కొందరు గ్రామస్తులు సంజయ్ ముందు నినాదాలు చేశారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గుర్తించిన పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పి పంపించారు. దీనితో పరిస్థితి కుదుటపడింది. బిజెపి నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.

Exit mobile version