Site icon vidhaatha

Bandi Sanjay | పేపర్‌ లీకేజీలో ఇద్దరే ఉంటే ఇతరులను ఎలా అరెస్టు చేశారు

విధాత‌: టీఎస్‌ఫీఎస్సీ పేపర్ల లీకేజీ ని నిరసిస్తూ.. మా నౌకరీలు మాగ్గావాలె అనే నినాదంతో ఇందిరాపార్క్‌ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహాధర్నాచేపట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay ) నేతృత్వంలో ఈ ధర్నా మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనున్నది.

ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. నిరుద్యోగులు ఆందోళన చెందవద్దన్నారు. లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. నేను లేని సమయంలో ఇంటికి వచ్చి నోటీసులు అంటించిపోయారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ మహాధర్నా చేపట్టాం. ఈరోజు సిట్‌ అధికారులను పిలిచి నేనే నోటీసులు అందుకున్నట్టు తెలిపారు.

ప్రశ్నపత్రం లీకేజీలో ఇద్దరి ప్రమేయం ఉన్నదని కేటీఆర్‌ చెప్పారు. ఇద్దరే ఉన్నప్పుడు ఇతరులను ఎలా అరెస్టు చేశారో మంత్రి సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తుంది… జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తుందని సంజయ్‌ తెలిపారు. ఈ ధర్నాకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్, విజయశాంతి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, వివేక్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Exit mobile version