Site icon vidhaatha

Bandi Sanjay | కేసీఆర్‌ కుటుంబంలో ఒక వికెట్‌ క్లీన్‌బౌల్డ్‌

విధాత: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) చేసిన సారా దందా.. కేసీఆర్‌కు నచ్చిన స్కీమ్‌ అని, కేసీఆర్‌ కుటుంబంలో ఒక వికెట్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసు (Delhi liquor case)లో కవితకు ఈడీ అధికారులు విచారణకు హాజరు కావాలంటూ జారీ చేసిన నోటీసులపై ఆయన పై విధంగా స్పందించారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ (BRS) రాష్ట్ర కమిటీలో ఎంత మంది మహిళలు ఉన్నారని ప్రశ్నించారు. రాష్ట్ర మహిళల కోసం కేసీఆర్‌ (CM KCR) ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహిళా దినోత్సవం (International Women’s Day)నిర్వహించే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదని విమర్శించారు.

‘బీఆర్‌ఎస్‌ మహిళా అధ్యక్షురాలు ఎవరో తెలియదు. ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు ఎమ్మెల్సీ ఇవ్వరా? తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదు’ అని సంజయ్‌ అన్నారు. కవితకు నోటీసులకు, తెలంగాణ సమాజానికి ఏం సంబంధమని నిలదీశారు. ఈడీ విచారణకు పిలిస్తే నిర్దోషి అని నిరూపించుకోవాలని సవాలు చేశారు. ‘కోర్టులు కొడుతాయా?’ అని గతంలో కేసీఆరే అన్నారని గుర్తుచేశారు.

దర్యాప్తు సంస్థలకు, బీజేపీకి ఏం సంబంధం అని సంజయ్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలోనూ ఈ దర్యాప్తు సంస్థలు ఉన్నాయని గుర్తు చేశారు. కవిత వల్ల తెలంగాణ మహిళలు తలదించుకునే పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. కేసీఆర్‌, కేటీఆర్‌ కవిత విషయంపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

Exit mobile version