Site icon vidhaatha

సచివాలయంలో బతుకమ్మ వేడుకలు

విధాత, హైదరాబాద్: సచివాలయంలో మంగళవారం బతుకమ్మ వేడుకలు సంబరంగా సాగాయి. తెలంగాణా సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పండుగ… తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టింది. సచివాలయంలోని ఉన్నతాధికారుల నుండి అన్ని స్థాయిల్లోని మహిళా ఉద్యోగులు తరలివచ్చారు. అత్యంత ఉత్సాహంతో సందడి చేశారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒకచోట ఉంచి మహిళా ఉద్యోగులు, పిల్లలు ఆటపాటలతో సంబరాలు చేశారు. దాండియా, బతుకమ్మ ఆటపాటల మధ్య జరిగిన ఈ ఉత్సవాల్లో సచివాలయ ఉన్నతాధికారులు, ఉద్యోగుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version