Site icon vidhaatha

BC ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్స్‌.. దరఖాస్తు గడువు పొడిగింపు

విధాత‌: బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వారం రోజులు పొడిగించామని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఐఎఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ మార్చి 8వ తేదీ తుది గడువు అని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన తెలిపారు.

ఈ పథకం ద్వారా ఎంపికైన బీసీ విద్యార్థులు విదేశాల్లో చదివేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్నిఅందిస్తోందని, విద్యార్థులు వీసా, పాస్‌పోర్ట్ కాపీతోపాటు, ఆధార్‌కార్డు, స్థానికత, కుల, ఆదాయ, ఇతర అవసరమైన అన్ని సర్టిఫికేట్లను జత చేస్తూ https://telanganaepass.cgg.gov.in లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

Exit mobile version