బీసీసీ మరో సంచలన నిర్ణయం..! మరో కొత్త లీగ్‌ సన్నాహాలు..! ఆ విశేషాలేంటంటే..?

బీసీసీఐ మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌తో క్రికెట్‌ స్వరూపాన్నే మార్చివేసింది.

  • Publish Date - December 15, 2023 / 12:28 PM IST

BCCI | బీసీసీఐ మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌తో క్రికెట్‌ స్వరూపాన్నే మార్చివేసింది. ఐపీఎల్‌ ప్రస్తుతం విజయవంతంగా సాగుతున్నది. ఈ క్రమంలోనే మరో సరికొత్త లీగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ లీగ్‌ కేవలం పది ఓవర్ల ఫార్మాట్‌లో ఉంటుందని సమాచారం. ఈ లీగ్‌కు సంబంధించిన బ్లూప్రింట్‌ విషయమై బీసీసీఐ కార్యదర్శి జై షా పని చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ లీగ్‌ ఆలోచనను స్పాన్సర్లు, స్టేక్‌ హోల్డర్లు సైతం స్వాగతించినట్లు సమాచారం.


అయితే, కొత్త లీగ్‌ను 2024లో తీసుకువచ్చేందుకు ప్లాన్‌ చేస్తుందని.. సెప్టెంబర్‌ – అక్టోబర్‌ మధ్య టోర్నీని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్‌ నడుస్తున్నది. కొత్త లీగ్‌ను పది ఓవర్ల ఫార్మాట్‌లో నిర్వహించాలా? ఐపీఎల్‌ మాదిరిగానే 20 ఓటర్లలో నిర్వహించాలా? అనేదిపై ఆలోచన చేస్తున్నది. అయితే, కొత్త లీగ్‌ నేపథ్యంలో ఐపీఎల్‌పై ప్రభావం చూపకుండా ఆటగాళ్లకు వయోపరిమితి విధించాలా? కొత్త లీగ్‌ ఫ్రాంచైజీల ఏర్పాటుకు స్పెషల్‌గా టెండర్లు నిర్వహించాలా? ప్రస్తుతం ఉన్న ఫ్రాంచైనీలకే ఆ హక్కులను కట్టబెట్టాలా అనే విషయంపై ఆలోచిస్తున్నది.


దాంతో పాటు భారత్‌లో టోర్నీని నిర్వహించాలా.. లేదంటో ప్రతి ఏడాది కొత్త వేదికల్లో నిర్వహించాలా? అనే విషయంపై బీసీసీఐ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. బీసీసీఐ 2008లో ఐపీఎల్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. టోర్నీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. యువ క్రికెటర్లు తమ సత్తాను చాటేందుకు వేదికగా నిలిచింది. విదేశాలకు చెందిన క్రికెటర్లు సైతం పాల్గొంటుండడంతో యావత్‌ ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌కు భారీగానే అభిమానులున్నారు.


ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌, ప్రసార హక్కులు, ఫ్రాంచైజీల నుంచి బీసీసీఐకి భారీగానే ఆదాయం సమకూరుతున్నది. ఐపీఎల్‌ క్రేజ్‌తో పలు దేశాలకు చెందిన బోర్డులు సైతం లీగ్‌లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. టీ10 క్రికెట్‌ ఫార్మాట్‌పై పలువురు అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే వన్డేలకు క్రేజ్‌ తగ్గిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పది ఓవర్ల లీగ్‌ను ప్రారంభిస్తే వన్డేలతో పాటు టెస్ట్‌ క్రికెట్‌ మనుగడ కష్టమేనని, ఆయా టోర్నీలపై అభిమానులు ఆసక్తిని కోల్పోయే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Latest News