Site icon vidhaatha

Minister Jagadish Reddy | బీజేపీ, కాంగ్రెస్‌లకు నిరుద్యోగమే: మంత్రి జగదీష్ రెడ్డి

విధాత: వారం రోజులుగా రాష్ట్రంలో ప్రతి పక్షాలు చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నాయని, కాంగ్రెస్ బీజేపీలు ఎన్ని కొంగ జపాలు దొంగ దీక్షలు చేసిన వారికి నిరుద్యోగమే మిగులుతుందని మంత్రి జి. జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీలో ఏదో జరిగిందని, కేసీఆర్ పైన, ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ఇవాళ ఒక ఆయన నిరుద్యోగ దీక్ష చేస్తున్నారని, ఆయన ఎన్ని కొంగ జపాలు చేసినా బీజేపీకి నిరుద్యోగమే ఉంటుందన్నారు. దేశంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోడీ హామీ ఇచ్చాడని, కాంగ్రెస్ ఇవ్వట్లేదు అని చెప్పి మోడీ ఎన్నికల్లో గెలిచాడన్నారు. 9ఏళ్ళు గడుస్తున్న ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. దేశ నిరుద్యోగులను ప్రధాని మోడీ బీజేపీ మోసం చేశాయన్నారు.

దేశంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటి కోసం బండి సంజయ్ ఢిల్లీలో ధర్నా చేయాలన్నారు. టీఎస్పీఎస్సీలో జరిగిన ఘటనను మేము బయట పెట్టామని, జరిగిన తప్పును వెల్లడించి దొంగలను పట్టుకుంది మేమే కదా అన్నారు.

మీలాగా ఈడీ, సీబీఐ వెంట వెళ్లి చూడలేదని బీజేపీకి చురకలాంటించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడుతూ ఎక్కడ అవినీతి లేకుండా పారదర్శకంగా పాలన అందిస్తున్నామన్నారు. మీ మధ్యప్రదేశ్ లాగా స్కాంలు చేయలేదన్నారు.

Exit mobile version