Dharani Portal | ధరణి పోర్టల్‌ను రద్దు చేసి.. విద్యుత్ కోతలను నివారించాలి: బీజేపీ ధర్నా

విధాత, రైతులను ఇబ్బంది పెడుతున్న ధరణి పోర్టల్ (Dharani Portal)ను రద్దు చేసి, విద్యుత్ కోతలను నివారించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ (BJP), కిసాన్ మోర్చా (BJP KISAN MORCHA) ఆధ్వర్యంలో గురువారం నల్గొండ (Nalgonda) తహశీల్దార్ (Tehsildar) కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ (Madagoni Srinivas Goud) మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిజమైన భూమి హక్కుదారులకు ఇబ్బంది కలిగిస్తున్న, అవినీతికి మూలమైనటువంటి ధరణి పోర్టల్‌ను వెంటనే రద్దు […]

  • Publish Date - March 10, 2023 / 09:09 AM IST

విధాత, రైతులను ఇబ్బంది పెడుతున్న ధరణి పోర్టల్ (Dharani Portal)ను రద్దు చేసి, విద్యుత్ కోతలను నివారించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ (BJP), కిసాన్ మోర్చా (BJP KISAN MORCHA) ఆధ్వర్యంలో గురువారం నల్గొండ (Nalgonda) తహశీల్దార్ (Tehsildar) కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ (Madagoni Srinivas Goud) మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిజమైన భూమి హక్కుదారులకు ఇబ్బంది కలిగిస్తున్న, అవినీతికి మూలమైనటువంటి ధరణి పోర్టల్‌ను వెంటనే రద్దు చేయాలన్నారు.

2018 ఎన్నికల్లో ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటు హామీని మరిచిపోయి, ఈరోజు కరెంటు కోతల విధిస్తున్న బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం వైఖరితో అన్నదాతల పోలాలు ఎండిపోతున్నాయన్నారు. అలాగే ఉచిత ఎరువుల హామీ, రైతులకు సబ్సిడీ వ్యవసాయ యంత్రాలు ఇస్తానని హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.

ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జాతీయ కిసాన్ మోర్చ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, రాష్ట్ర దళిత మోర్చ కార్యదర్శి పోతేపాక సాంబయ్య, జిల్లా, మండల పార్టీ నాయకులు, కిసాన్ మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News