Site icon vidhaatha

బాలీవుడ్ బాలయ్య రణబీర్ కపూర్..!

విధాత‌: హీరోలకు అభిమానులే దైవంతో సమానమని అందరూ చెప్పే మాటే. ప్రతి ఒక్కరూ ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం అంటారు. కానీ వారు ఏదైనా ఫోటో తీసుకోవడానికి గానీ, ఆటోగ్రాఫ్ కోసం గానీ ప్రయత్నిస్తే వారిపై విరుచుకు పడుతూ ఉంటారు. సాధారణంగా మన టాలీవుడ్‌లో బాలకృష్ణ ఈ విధంగా చేస్తూ ఉంటారు. అభిమానులు అత్యుత్సాహం కొద్దీ సెల్ఫీలు దిగబోతే వారి ఫోను విసిరి కొట్టిన ఘటనలు చాలానే ఉన్నాయి.

తాజాగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కూడా ఇదే తరహాలో వ్యవహరించారు. ఓ అభిమాని అత్యుత్సాహం చూపించకపోయినప్పటికీ ఆయనపై మండిపడ్డారు. ఒకసారి సెల్ఫీ తీసుకోవడానికి ఆ అభిమాని రణబీర్ కపూర్ ను రిక్వెస్ట్ చేసి సెల్ఫీ తీసుకున్నాడు. కానీ అది సరిగా రాలేదు.

దాంతో మరోసారి సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. దాంతో సహనం కోల్పోయిన రణబీర్ కపూర్ ఆ ఫ్యాన్‌ చేతిలో ఫోను లాక్కొని విసిరి కొట్టాడు. దీంతో పలువురు నెటిజన్లు రణబీర్ కపూర్ ప్రవర్తన సరికాదని మండి పడుతున్నారు.

ఫ్యాన్స్ మరీ ఓవర్ గా ఏమీ బిహేవ్ చేయలేదని సహజంగా సెల్ఫీ అడిగాడని అది బాగా రాకపోవడంతో మరో సెల్ఫీ కోసం ట్రై చేయడమే పెద్ద తప్పుగా రణబీర్ కపూర్ సహనం కోల్పోవడం సరికాదని నెటిజన్ల అభిప్రాయం.

Exit mobile version