Site icon vidhaatha

బీజేపీలో చేరిన బాలీవుడ్ సింగ‌ర్ అనురాధ పౌడ్వాల్‌

న్యూఢిల్లీ : బాలీవుడ్ సింగ‌ర్ అనురాధ పౌడ్వాల్ బీజేపీలో చేరారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో శ‌నివారం ఆమె కాశాయ కండువా క‌ప్పుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మానికి కట్టుబడి పనిచేస్తున్న బీజేపీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పార్టీ సిద్ధాంతాల‌కు క‌ట్టుబ‌డి, ప్ర‌జ‌ల విశ్వాసానికి అనుగుణంగా ప‌ని చేస్తాన‌ని ఆమె వెల్ల‌డించారు.


వివిధ భాష‌ల్లో వంద‌లాది పాట‌లు, భ‌జ‌న కీర్త‌న‌లు పాడిన అనురాధ క‌ర్ణాట‌క‌లోని క్వారాలో జ‌న్మించారు. త‌న 19 ఏట అభిమాన్ చిత్రంలో ఓంకారం బిందు సంయుక్తం అనే పాట‌తో మంచి పేరు సంపాదించారు. ఆ త‌రువాత 1983లో ‘హీరోస సినిమాలో ఆమె పాడిన ‘తూ మేరా హీరో హై’ పాట అప్ప‌ట్లో చాలా ఫేమ‌స్ అయింది. అనురాధ పౌడ్వాల్ నాలుగు సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు.

Exit mobile version