విధాత : ప్రజాభవన్ గేట్లను ఢీ కొట్టిన ర్యాష్ డ్రైవింగ్ కేసులో బోధన్ మాాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు సోహెల్‌కు పోలీసులు లుక్ అవుట్ నోటీస్‌లు జారీ చేశారు. ప్రజాభవన్ గేట్లను ఢీ కొట్టిన కారును తాను నడపలేదని, ఇంటి పనిమనిషి అబ్ధుల్ ఆ సమయంలో కారు నడిపాడని అతడిని లొంగిపోయేలా చేసిన సోహెల్ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
ఈ వ్యవహారం వివాదస్పదం కావడంతో సీసీ కెమెరాల ఆధారంగా మరింత లోతైన దర్యాప్తు జరిపించిన సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఈ కేసు నుంచి సోహెల్‌ను తప్పించేందుకు ప్రయత్నించిన పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేశారు. అటు దుబాయ్‌లో ఉన్న తండ్రి షకిల్ సూచన మేరకు ఇప్పటికే సోహెల్ కారు ప్రమాదం తర్వాతా ముంబయికి వెళ్లి అక్కడి నుంచి దుబాయ్‌కు పారిపోయాడని పోలీసులు గుర్తించి అతడిని పట్టుకునేందుకు లుకౌట్ నోటీస్‌లు జారీ చేశారు