- మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపణ
విధాత: అసెంబ్లీలో మాట్లాడటానికి తమకు అనుమతి ఇవ్వడం లేదంటూ బీఆరెస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి బయటకు వచ్చారు. అనంతరం ఆసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడ టానికి వెళుతున్న బీఆరెస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకున్నారు. సభ నడుస్తున్న సమయంలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడడం సరికాదన్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని నిరసనకు దిగారు. కంచెలు తొలగిస్తామన్నారు. అసెంబ్లీ ఇవేమి కంచెలని బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు.
అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదని ఎపుడు నిబంధన పెట్టారని బీఆరెస్ ఎమ్మెల్యేలు చీఫ్ మార్షల్ ను ప్రశ్నించారు. నిబంధన ఉంటే తమకు చుపించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ తో మాట్లాడి చెబుతానని వెళ్లి చీఫ్ మార్షల్ వెళ్లారు. దీంతో శాసన సభా పక్ష కార్యాలయాలున్న సమీపం లో బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఇదేమి రాజ్యం… ఇదేమి రాజ్యం …కంచెల రాజ్యం… పోలీస్ రాజ్యం అని నినాదాలు చేశారు. అసెంబ్లీ లోపల మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు ..అసెంబ్లీ బయట కూడా మీడియా తో మాట్లాడేందుకు అనుమతి కూడా ఇవ్వరా అని నినాదాలు చేశారు.