విధాత : ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్తో బీఆరెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం ఆటోలలో అసెంబ్లీకి వచ్చారు. ఎమ్మెల్యేలు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వివేకానంద, మాధవరం కృష్ణారావు, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్.. హైదరాబాద్ హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు
ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలోకి ఆటోల అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని బయటనే నిలిపివేశారు . పోలీసులతో బీఆరెస్ ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద సైఫాబాద్ ఎసిపి సంజయ్ నీ వేస్ట్ ఫెలో అంటూ తిట్టడంతో పోలీసులకు ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వివాదం.. తోపులాట సాగింది. ఫ్లకార్డ్ కర్రతో ఎమ్మెల్యే వివేకానంద పోలీసుల పైకి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇతర ఎమ్మెల్యేలు, పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.