MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం (Kavitha Birthday) సందర్భంగా నిజామాబాద్ (Nizamabad)కు చెందిన బీఆర్ఎస్ (BRS) నాయకుడు చిన్ను గౌడ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేసి అభిమానాన్ని చాటుకున్నాడు.
అండమాన్ నికోబార్ దీవుల్లో బంగళా ఖాతం సముద్రపు అంచుల్లోకి వెళ్లిన చిన్నుగౌడ్, ఇతరులు ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. నీటి అడుగున డైవింగ్ చేస్తూ బ్యానర్లను ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
దీనికి సంబంధించిన వీడియోను టీఎస్ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ చేతుల మీదుగా ఆదివారం రాత్రి 12 గంటలకు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.