Site icon vidhaatha

Medaram | మేడారంలో పూజారి దారుణ హత్య.. బండరాళ్లతో తలపై

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం (Medaram) గ్రామంలో దారుణహత్య జరిగింది. మేడారం శివారు కొండాయి గ్రామానికి గ్రామానికి చెందిన గోవిందరాజుల పూజారి దబ్బగట్ల రవి(45)ని తల మీద పెద్ద బండరాళ్లతో కొట్టి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బంధువుల ఫిర్యాదు మేరకు హత్య పై తాడ్వాయి పోలీసులు విచారణ చేస్తున్నారు.

ముందస్తు ప్రణాళిక ప్రకారమే రవిని హత్య చేసినట్లు సంఘటనను బట్టి పోలీసులు అనుమాని స్తున్నారు. వ్యక్తిగత తగాదాల, ఇతరత్రా ఏవైనా కారణాలు ఉన్నాయా అని ఆరాతీస్తున్నారు. స్థానికంగా ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యకాలంలో దబ్బకట్ల రవి ఎవరితో ఉన్నారు, ఎక్కడెక్కడ తిరిగారు అనే విషయమై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Exit mobile version