విధాత: మునుగోడు ఉప ఎన్నికకు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్ల కోసం బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తయ్యిందని సీఈవో చెప్పారు. 33 శాతం అదనపు ఈవీఎంలు, వీవీ ప్యాట్లు రిజర్వ్ అధికారికి కేటాయించామన్నారు.
అవసరమైన సంఖ్యలో పోలింగ్ సిబ్బందిని నియమించాం. మునుగోడులో ఇప్పటి వరకు 12 కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు. అక్రమంగా తరలిస్తున్న రూ. 2.49 కోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. సమాచారం కోసం 0868-2230198 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.