Site icon vidhaatha

Nalgonda: I 10,287 వాహనాలపై కేసు.. 15 మందికి జైలు: SP అపూర్వారావు

విధాత: ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని నల్లగొండ ఎస్పీ అపూర్వారావు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ నెల మార్చి 1 వ తేదీ నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సరియైన పత్రాలు, రాంగ్ డ్రైవింగ్, నో హెల్మెట్, ట్రిపుల్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, నో పార్కింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, విత్ ఔట్ సీట్ బెల్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి వాటిపై 10287కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

వాటిలో టు వీలర్స్ వాహనాలు 5647, త్రీ వీల‌ర్ వాహనాలు 636, ఫోర్ వీల‌ర్‌ వాహనాలు 3667, లారీలు 37, ఇతర వాహనాలు 300 మొత్తం 10287 వాహనాలు పైన కేసులు నమోదు చేయగా 4,33,660 రూపాయల పైన్ వేయడం జరిగిందన్నారు.

మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 929 మంది పట్టుబడగా వీరిలో 420 మందిని కోర్టులో హాజరుపరచగా 9 మందికి ఒక రోజు, 6 మందికి రెండు రోజుల జైలు శిక్ష, జరిమానా వేస్తూ కోర్టులు తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన వ్యక్తులకు జరిమానా విధించారని వివరించారు. ఈ నెలలో ఇప్పటి వరకు మొత్తం డి.డి కేసులలో 508446 రూపాయల జరిమాన విధించామ‌ని తెలిపారు.

యువత, ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రతి రోజు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తామని తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చ‌రించారు. వాహన దారులు వాహనానికి సంబంధించిన సరియైన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులకు చర్యలు తప్పవన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాలలో, పబ్లిక్ ప్లేస్‌లలో మద్యం తాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు, వాహనదారులు రోడ్డు నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని కోరారు.

Exit mobile version