Site icon vidhaatha

నేడు తెలంగాణ అసెంబ్లీలో కుల గణన బిల్లు

విధాత, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో నేడు ప్రభుత్వం కీలకమైన కుల గణన బిల్లు ప్రవేశపెట్టనుంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు బీసీ కులగణన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. కుల గణన చేపట్టి, జనాభా థామాషా ప్రకారం తమకు బడ్జెట్ కేటాయింపు చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు బీసీ కుల గణన చేపట్టాలని నిర్ణయించింది.


ఇప్పటికే కుల గణన నిర్వహించిన కర్ణాటక, బీహార్‌, ఏపీ రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన మార్గదర్శకాలు విధి విధానాలతో తెలంగాణ బీసీ కుల గణన బిల్లును రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణన బిల్లు రూపకల్పన బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపధ్యంలో నేడు అసెంబ్లీ ముందుకు రానున్న కులగణన బిల్లుపై ఆసక్తి నెలకొంది.

Exit mobile version