Site icon vidhaatha

Chandrababu | పొత్తులు ఉంటాయ్.. ఉండాల్సిందే! తేల్చేసిన చంద్రబాబు

Chandrababu |

విధాత: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు తన రాజకీయ చతురతను బయట పెడుతున్నారు. రానున్న ఎన్నికలకు పొత్తులు ఉంటాయని, అసలు పొత్తులు ఉండాల్సిందే అని తేల్చేశారు. జగన్ ను ఎదుర్కోవాలి అంటే పొత్తులు తప్పదని డిక్లేర్ చేశారు.

పొత్తులు టీడీపీకి కొత్త కాదని అన్నారు. గతంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రండ్, ఎన్డీయేలలో తెలుగుదేశం ప్రముఖ పాత్ర పోషించింది అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, రాష్ట్రానికి మేలు చేయనందునే తాను ఆనాడు బీజేపీ నుంచి దూరం జరిగానని చెబుతూ, ప్రస్తుతం తనకు బీజేపీతో విభేదాలు లేవని కవరింగ్ చేశారు. ఏపీ పునర్నిర్మాణం కావాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో కలసి పనిచేయాల్సి ఉంటుందని అన్నారు.

కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో కలసి పనిచేస్తామని చెబుతూ, దానికి ఏపీ అభివృద్ధి అనే కవరింగ్ వేస్తున్నారు. ఏపీ విభజన కారణంగా కంటే కూడా ఇపుడు దారుణంగా నష్టపోయిందని, దానికి జగన్ ప్రధాన కారణం అని, ఇప్పుడు జగన్ ను ఓడించడమే ఏపీ అభివృద్ధికి సోపానం అని అన్నారు.

ఏపీలో పొత్తులు ఎపుడు ఎవరితో అన్నది ఎన్నికల వేళ తేలుతుందని బాబు అంటున్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కోవాలంటే పొత్తులే శరణ్యమని ఆయన తేల్చేశారు. నిన్న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డాను కలిశారు. ఈ సందర్భంగా పొత్తుల అంశం చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు.

Exit mobile version