Site icon vidhaatha

బాబ్బాబు.. నచ్చినన్ని సీట్లిస్తా.. బీజేపీతో చంద్రబాబు రాయబేరం.!

ఉన్న‌మాట: రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు తనకు అత్యంత కీలకం అన్నది గుర్తెరిగిన చంద్రబాబు ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ సారి గానీ ఓడిపోతే ఇక రాజకీయ సన్యాసం తప్పదని, అధికారం లేకుండా జగన్‌ను ఎదుర్కోవడం కష్టమని ఇప్పటికే ఆయనకు అర్థం అయింది. పోనీ ఈసారి గట్టిగా పోరాడుదాం.. జగన్ను ఓడిద్దాం అంటే శక్తి సరిపోవడం లేదు పవన్ కళ్యాణ్‌ను కలుపుకున్నా జగన్‌ను ఓడించడం సాధ్యం కాదని భావిస్తున్నారో ఏమో గానీ బీజేపీకి వల విసురుతున్నారు.

బీజేపీ పొత్తుతో చాలా రాజకీయ లాభాలు ఉన్నాయని బాబు ఊహిస్తున్నారు. దాంతో బీజేపీని తమ దారిలోకి తెచ్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఏకంగా పది ఎంపీ సీట్లను బాబు ఆఫర్ చేశారని ఈ ఎంపీ సీట్లు కూడా వారు కోరుకున్న చోట ఇవ్వడానికి రెడీ అని రాయబేరం పంపినట్లు తెలుస్తోంది. బీజేపీకి ఎంపీ సీట్లే ముఖ్యం.

వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలంటే కావాల్సినంతమంది ఎంపీలు ఉండాలి. బీజేపీ ఇప్పటికిపుడు ఏపీలో అధికారంలోకి వచ్చేంత సీన్ లేదు. దాంతో చంద్రబాబు తెలివిగానే ఎంపీల సీట్ల పేరిట ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. పైగా వారు ఎక్కడ కోరుకుంటే అక్కడ సీట్లు అని కూడా బోల్డ్ ఆఫర్ ఇచ్చేశారు.

2014 ఎన్నికల్లో బీజేపీకి అయిదు సీట్లు ఇచ్చిన బాబు ఇపుడు ఆ సంఖ్యను రెట్టింపు చేశారు. బీజేపీ గానీ ఇంకా గట్టిగా డిమాండ్ చేస్తే ఇంకొన్ని సీట్లు ఇవ్వడానికి కూడా చంద్రబాబు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను బీజేపీ ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి.. అవకాశవాది అయిన చంద్రబాబును మళ్లీ నమ్ముతారా.. మళ్లీ తమతో కలుపుకుంటారో లేదో చూడాలి.

Exit mobile version