Site icon vidhaatha

Cancer Patients | క్యాన్సర్ రోగుల సహాయార్థం చిత్ర ప్రదర్శన

విధాత‌: క్యాన్సర్ రోగుల సహాయార్థమై ఈనెల 6 తారీఖున హైదరాబాదులోని చిత్రమయి స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో బంజారాల జీవన ఇతివృత్తాలను ప్రతిబింబింపజేసే చిత్రాలను ప్రదర్శించనున్నట్లు మహబూబ్ నగర్ కు చెందిన ప్రముఖ చిత్రకారుడు, విద్యుత్ శాఖలో ఏఈగ విధులు నిర్వహిస్తున్న ఆకుల సోమశేఖర్ (Akula Somasekhar) తెలిపారు.. తన బాల్యం నుండే చిత్రకళ తనకు అబ్బినట్లు ఆయన తెలిపారు.

ఇప్పటికే అనేకమంది స్వతంత్ర వీరుల, మరియు ఎంతోమంది వర్తమాన రాజకీయ నాయకుల చిత్రాలు జీవ కళా ఉట్టిపడేలా ఆయన కుంచె నుంచి జాలువారాయి. మహబూబ్ నగర్ మట్టిలో ఇంత అద్భుతమైన చిత్రకారుడు దాగి ఉండటం మనందరం గర్వించదగ్గ విషయం. సోమశేఖర్ నైపుణ్యాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం మనందరి పైన ఉంది.

ఆయన చిత్రకళా నైపుణ్యాన్ని గుర్తించిన మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఈ ప్రదర్శనకు సహకరించి, ప్రదర్శన రోజు తానే స్వయంగా హాజరవుతానని సోమశేఖర్ వెల్లడించారు. ప్రదర్శన ప్రారంభోత్సవం రోజున మంత్రి తో పాటుగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా హాజరవనున్నట్లు సోమశేఖర్ తెలిపారు.

Exit mobile version