Cheetah Uday |
మధ్యప్రదేశ్ కునే నేషనల్ పార్క్‌లో ఉదయ్(Cheetah Uday )అనే మగ చిరుత మృతి చెందింది. కేంద్ర ప్రభుత్వం దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఉదయ్ చిరుత కూడా ఒకటి. ఆదివారం ఉదయం అనారోగ్యానికి గురైన చిరుత.. చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జేఎస్ చౌహాన్ ధ్రువీకరించారు. చిరుత వయసు ఆరేళ్లని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం చిరుత అస్వస్థతకు గురైంది. దీన్ని అటవీశాఖ బృందం గమనించి.. వైద్య కేంద్రానికి తరలించారు.
ఆ తర్వాత చికిత్స పొందుతూ సాయంత్రం సమయంలో మృతి చెందింది. కునో నేషనల్ పార్క్‌లో చిరుత మరణించడం ఇది రెండోది. మార్చి 27న నమీబియా నుంచి తీసుకువచ్చిన నాషా అనే చిరుత కిడ్నీ వ్యాధితో మృతి చెందింది.
మృతి చెందిన చిరుతకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. వీడియో, ఫొటోలు తీయనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న ఉదయ్‌తో పాటు 11 చిరుతలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చారు. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు మొత్తం 20 చిరుతలను తీసుకువచ్చారు. ప్రస్తుతం రెండు చిరుతలు మరణించడంతో వాటి సంఖ్య 18కి తగ్గింది.