Cheetah’s Hunt l ఔరా.. ఏమా వేగం.. ఏమా శక్తి!

cheetah's hunt beautifully విధాత: మెరుపు వేగానికి తిరుగులేని శక్తికి నిదర్శనం చిరుతలు! ఆహారం కనిపించిందంటే చాలు.. అవి ఎంత వేగంగా పరిగెత్తినా.. మెరుపు వేగంతో కదిలి.. చటుక్కున పట్టే నైపుణ్యం చిరుతల (cheetah's hunt beautifully) సొంతం. అటువంటి అద్భుతమైన దృశ్యాలు ఎప్పుడైనా సరే ఆసక్తికరంగానే ఉంటాయి. అలాంటి సందర్భమే ఒకటి వీడియోలో రికార్డయింది. ఇది ఎక్కడ చిత్రీకరించారో తెలియదు కానీ.. ప్రపంచ వ్యాప్తంగా జంతు ప్రేమికులను అబ్బరపరుస్తున్నది. ఈ వీడియోలో ఒక చిరుత మరో […]

  • Publish Date - March 8, 2023 / 12:29 PM IST

cheetah’s hunt beautifully

విధాత: మెరుపు వేగానికి తిరుగులేని శక్తికి నిదర్శనం చిరుతలు! ఆహారం కనిపించిందంటే చాలు.. అవి ఎంత వేగంగా పరిగెత్తినా.. మెరుపు వేగంతో కదిలి.. చటుక్కున పట్టే నైపుణ్యం చిరుతల (cheetah’s hunt beautifully) సొంతం. అటువంటి అద్భుతమైన దృశ్యాలు ఎప్పుడైనా సరే ఆసక్తికరంగానే ఉంటాయి.

అలాంటి సందర్భమే ఒకటి వీడియోలో రికార్డయింది. ఇది ఎక్కడ చిత్రీకరించారో తెలియదు కానీ.. ప్రపంచ వ్యాప్తంగా జంతు ప్రేమికులను అబ్బరపరుస్తున్నది. ఈ వీడియోలో ఒక చిరుత మరో ప్రాణిని వేటాడుతుంది.

మెరుపువేగం (incredible speed)తో కదిలిన చీతా.. క్షణాల వ్యవధిలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం, ఆహారాన్ని (prey) పట్టుకుని.. దాదాపు సడన్ బ్రేక్ వేసినట్టుగా ఆగిపోవడం వీడియోలో కనిపిస్తున్నది. స్పానిష్ భాషలో వెలోసిడాడ్ ఫ్యుయర్జా (Velocidad y fuerza) పేరుతో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటున్నది. అంటే.. వేగం.. బలం (speed and strength) అని అర్థం.

చిరుతల అద్భుత వేగానికి కారణం.. వాటి వెన్నుపూస చాలా సరళంగా ఉంటుంది. అందువల్లే అవి అంత వేగంగా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఊహించలేనంత వేగంగా పరుగులు తీస్తాయి. నేషనల్ జియో గ్రాఫిక్ (National Geographic) అంచనా ప్రకారం ఒక చిరుత ఒక్క ఉదుటన ఏడు నుంచి ఎనిమిది మీటర్ల మేర అంగ వేయగలదు.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జీవిగా పేరున్నప్పటికీ.. ఇది పెద్ద పులి(big cat)లా గాండ్రించ లేదు.. సింహం(lions)లా గర్జించలేదు.. జస్ట్ పిల్లిలా కూతలు పెడుతుంది. ఒకప్పుడు మన దేశంలో భారీ సంఖ్యలో ఉండిన చిరుతలు.. కాలక్రమేణా పూర్తిగా అంతరించిపోయాయి. దీంతో చీతాల పునరుజ్జీవన కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం ఆఫ్రికా దేశాల నుంచి చిరుతలను దేశానికి తరలిస్తున్న సంగతి తెలిసిందే.