Site icon vidhaatha

మాంసం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు..!

Chicken : చికెన్‌ ప్రియులకు శుభవార్త. మొన్నటి వరకు భారీగా పెరిగిన ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. 15 రోజుల కిందటి వరకు హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా రూ.250 నుంచి రూ.270 వరకు పలికిన ధర ప్రస్తుతం రూ.160కి తగ్గింది.

అయితే, ఏటా వేసవి ప్రారంభంలో 30శాతం నుంచి 40శాతం వరకు చికెన్‌ అమ్మకాలు తగ్గుతుంటాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఉత్పత్తి పెరగడంతో డిమాండ్‌ తగ్గడం వల్ల ధరల తగ్గుదలకు కారణమని పేర్కొంటున్నారు. హైదరాబాద్‌ నగరంలో నిత్యం దాదాపు 6లక్షల కిలోల వరకు అమ్మకాలు జరుగుతుంటాయి.

ప్రస్తుతం డిమాండ్‌ తగ్గడంతో దాదాపు 4లక్షల వరకు అమ్మకాలు తగ్గినట్లుగా అంచనా. ధరలు పడి పోతుండడంపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాయిలర్‌ కోళ్లతో పాటు నాటుకోళ్ల ధరలు తగ్గుమఖంప డుతుండడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. పలుచోట్ల పలువురు రిటైల్‌ వ్యాపారులు ధరలు తగ్గించకపోవడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు, బ్రాయిలర్‌ కోడి లైవ్‌ ధర రూ.90కు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అదే సమయంలో కోడిగుడ్డు ధరలు పది రోజులుగా తగ్గుముఖం పట్టాయి. వందకోడిగుడ్లు జనవరి రూ.555 ఉండగా.. ప్రస్తుతం రూ.440గా ఉన్నది. రిటైల్‌లో మాత్రం వ్యాపారులు ఒకటికి రూ.6 నుంచి రూ.6.50 వరకు విక్రయిస్తున్నారు.

Exit mobile version