Site icon vidhaatha

Inspiring Journey | గుడిసె నుంచి విల్లా స్థాయికి.. సివిల్ స‌ర్వెంట్ స్ఫూర్తిదాయ‌క స్టోరీ

Inspiring Journey

విధాత‌: ల‌క్ష్యాన్ని నిర్దేశించుకొని అంకిత‌ భావంతో క‌ష్ట‌ప‌డి చ‌దివితే ఉన్న‌త స్థాయికి చేరుకోవ‌డం సుల‌భ‌మేన‌ని నిరూపించారు ఓ ఐఏఎస్ అధికారి. చ‌దువుకోవ‌డానికి, కెరీర్‌లో ఎద‌గ‌డానికి పేద‌రికం అడ్డుకాబోద‌ని చెప్ప‌డానికి త‌న జీవిత‌మే ఉదాహ‌ర‌ణ అని పేర్కొన్నారు.

త‌న జీవ‌నం అట్టడుగు నుంచి అత్యున్న‌త స్థాయికి ఎలా సాగిందో చెప్ప‌డానికి ఆ అధికారి రెండు ఫొటోల‌ను తాజాగా సోష‌ల్‌మీడియాలో పోస్టు చేశారు. ఆయ‌నే నాగాలాండ్ ముఖ్య‌మంత్రికి ఓఎస్డీగా ప‌నిచేస్తున్న నెల్ల‌యప్ప‌న్ బీ.

“నేను 30 ఏండ్ల‌ వరకు నా తల్లిదండ్రులు, నలుగురు తోబుట్టువులతో ఈ ఒకే గది ఇంటిలో (కొబ్బరి ఆకుల పైకప్పు) నివసించాను. చదువు, అంకితభావం, కృషి ద్వారా ఈ స్థానానికి చేరుకున్నాను” అని నాడు తాము జీవించిన ఒకే గ‌ది ఇంటి ఫొటో, నేడు త‌న కుటుంబంలో నివ‌సిస్తున్న రెండు అంత‌స్థుల బంగ్లా ఫొటోను నెల్ల‌యప్ప‌న్ బీ ట్విట్ట‌ర్‌లో పోస్టుచేశారు.

ఈ నెల 6న ఆయ‌న పోస్టు చేసిన ఫొటోల‌కు నెటిజ‌న్ల నుంచి అనూహ్య స్పంద‌న వ‌స్తున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు వాటిని 6 ల‌క్ష‌ల మంది చూశారు. 12 వేల మంది లైక్‌ చేశారు. వేల మంది కామెంట్లు చేస్తున్నారు.

“మ‌న‌కు ఏ వనరు లేనప్పుడు, విద్య అనేది స్వేచ్ఛకు నిజమైన సాధనం. ” విద్య, అంకితభావం, కష్టపడి పనిచేయడం కీలకం. అది ఎదుగుద‌ల‌కు దోహ‌దం చేస్తుంది.” “మీది స్ఫూర్తిదాయ‌క‌మైన జ‌ర్నీ” అని ఇలా ప‌లువురు ప‌లుర‌కాలుగా నెటిజ‌న్లు కామెంట్లు పెట్టారు.

Exit mobile version