Site icon vidhaatha

Civils Results | సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు.. సూర్యాపేట అమ్మాయి ఉమా హార‌తికి 3వ ర్యాంకు

Civils Results | యూపీఎస్సీ ప్ర‌క‌టించిన సివిల్స్ 2022 తుది ఫ‌లితాల్లో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన అభ్య‌ర్థులు మెరిశారు. దేశ వ్యాప్తంగా 933 మందిని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌తో పాటు ప‌లు ఉద్యోగాల‌కు ఎంపిక చేశారు. ఆలిండియా ఫ‌స్ట్ ర్యాంక‌ర్ ఇషితా కిశోర్. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఇషితా మూడో ప్ర‌య‌త్నంలో సివిల్స్ సాధించింది.

ఇక తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు చెందిన ప‌లువురు అభ్య‌ర్థులు కూడా సివిల్స్ ఫ‌లితాల్లో మెరిశారు. నారాయ‌ణ‌పేట ఎస్‌పీ నూక‌ల వెంక‌టేశ్వ‌ర్లు కుమార్తె నూక‌ల ఉమా హార‌తి ఆలిండియా లెవ‌ల్‌లో 3వ ర్యాంకు సాధించి, అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

నూక‌ల ఉమా హార‌తి స్వ‌స్థ‌లం సూర్యాపేట జిల్లాలోని హుజుర్ న‌గ‌ర్‌. హార‌తి వ‌ల్ల తాత ఉపాధ్యాయుడిగా ప‌ని చేసి ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. నాన్న వెంక‌టేశ్వ‌ర్లు ఎస్పీగా కొన‌సాగుతున్నారు. హార‌తి 3వ ర్యాంకు సాధించి, అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతోంది. హార‌తి సోద‌రుడు సాయి వికాస్ 2021లో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో జాతీయ స్థాయిలో 12 వ ర్యాంకు సాధించి శిక్షణ పూర్తి చేసుకొని ఈ నెలలోనే విధుల్లో చేరాడు.

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా చిట్యాల మండ‌లం గుంటూరుప‌ల్లికి చెందిన శాఖ‌మూరి శ్రీసాయి హ‌ర్షిత్ 40వ ర్యాంకు, జ‌గిత్యాల జిల్లా కోరుట్ల మండ‌లం ఐలాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు శివ మారుతి రెడ్డి 132వ ర్యాంకు సాధించారు.

బీవీఎస్ ప‌వ‌న్ ద‌త్తా 22వ ర్యాంకు, హెచ్ఎస్ భావ‌న‌కు 55, సాయి ప్ర‌ణ‌వ్‌కు 60, నిధి పాయ్ 110, అంకుర్ కుమార్ 257, చ‌ల్లా క‌ళ్యాణి 285, వై శృతి 362, శ్రీకృష్ణ 293, హ‌ర్షిత 315, లక్ష్మి సుజిత 311, సోనియా క‌టారియా 376, రేవ‌య్య 410, సీహెచ్ శ్ర‌వ‌ణ్ కుమార్ రెడ్డి 426, రామ్‌దేని సాయినాథ్‌ 742, రెడ్డి భార్గ‌వ్ 772, నాగుల కృపాక‌ర్ 866వ ర్యాంకు సాధించారు.

మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిని పర్సనాలిటీ టెస్టు కోసం ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఇంటర్వ్యూ చేసింది. ఫైనల్‌గా 933 మందిని వేర్వేరు సర్వీసులకు ఎంపిక చేసింది. మొత్తం 345 మంది జనరల్‌ కోటాలో ర్యాంకులు సాధించారు. ఇక 99 మంది ఈడ‌బ్ల్యూఎస్ కోటాలో, 263 మంది ఓబీసీ కోటాలో, 154 మంది ఎస్సీ కోటాలో, 72 మంది ఎస్‌టీ కోటాలో 2022 సివిల్‌ సర్వీసులకు ఎంపికయ్యారు.

Exit mobile version