">

CM Arvind Kejriwal | ముంబైలో “ఇండియా” భేటీకి ఆప్‌ – vidhaatha " /> " />

CM Arvind Kejriwal | ముంబైలో “ఇండియా” భేటీకి ఆప్‌

స్పష్టంచేసిన పార్టీ క‌న్వీన‌ర్ కేజ్రీవాల్‌ CM Arvind Kejriwal | విధాత‌: ఈ నెల చివ‌ర‌లో ముంబైలో జ‌రిగే ప్ర‌తిప‌క్ష కూట‌మి ఇండియా స‌మావేశానికి తాను హాజ‌రవుతాన‌ని ఆప్ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ స్ప‌ష్టంచేశారు. "మేము ముంబైకి వెళ్తాం. మా వ్యూహం గురించి స‌మావేశంలో తెలియజేస్తాం" అని కేజ్రీవాల్ సోమ‌వారం ఢిల్లీలో విలేకరులకు వెల్ల‌డించారు. ఇటీవ‌ల కాంగ్రెస్, ఆప్ మ‌ధ్య నెల‌కొన్న ఆపోహ‌ల‌కు తెర‌దించారు. ఢిల్లీ లోక్‌సభ స్థానాల వ్య‌వ‌హారంలో ఇండియా కూటమి సభ్యులైన […]

  • Publish Date - August 21, 2023 / 10:20 AM IST

  • స్పష్టంచేసిన పార్టీ క‌న్వీన‌ర్ కేజ్రీవాల్‌

CM Arvind Kejriwal | విధాత‌: ఈ నెల చివ‌ర‌లో ముంబైలో జ‌రిగే ప్ర‌తిప‌క్ష కూట‌మి ఇండియా స‌మావేశానికి తాను హాజ‌రవుతాన‌ని ఆప్ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ స్ప‌ష్టంచేశారు. “మేము ముంబైకి వెళ్తాం. మా వ్యూహం గురించి స‌మావేశంలో తెలియజేస్తాం” అని కేజ్రీవాల్ సోమ‌వారం ఢిల్లీలో విలేకరులకు వెల్ల‌డించారు. ఇటీవ‌ల కాంగ్రెస్, ఆప్ మ‌ధ్య నెల‌కొన్న ఆపోహ‌ల‌కు తెర‌దించారు.

ఢిల్లీ లోక్‌సభ స్థానాల వ్య‌వ‌హారంలో ఇండియా కూటమి సభ్యులైన ఆప్‌, కాంగ్రెస్ నాయ‌కుల‌ మధ్య ఇటీవల మాట‌ల యుద్ధం కొనసాగింది. ఈ నేప‌థ్యంలో ముంబైలో జ‌రిగిన మూడోవ ఇండియా స‌మావేశానికి ఆప్ దూరంగా ఉంటుంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఇండియా కూట‌మిలో అప్పుడే లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయ‌ని బీజేపీ నేత‌లు కొంద‌రు ఆరోప‌ణ‌లు చేశారు.

పొత్తు పెట్టుకునే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఢిల్లీలో మొత్తం ఏడు లోక్‌స‌భ స్థానాలకు సిద్ధం కావాలని నిర్ణ‌యించిన‌ట్టు ఇటీవ‌ల కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆప్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఒంటరిగా వెళ్లాలనుకుంటే ముంబైలో జరిగే భారత కూటమి తదుపరి సమావేశానికి హాజరయ్యే ప్రసక్తే లేదని ఆప్ నేత‌లు అన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కేజ్రీవాల్ తాజా ప్ర‌క‌ట‌న‌లో ఆపోహ‌ల‌న్నీతేలిపోయాయి.

అయితే, ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబైలో జరిగే సమావేశంలో ప్రతిపక్ష భారత కూటమి లోగోను ఆవిష్కరించే అవకాశం ఉన్న‌ట్టు కూట‌మి వర్గాలు తెలిపాయి. దేశ ఆర్థిక రాజధానిలో జరిగే ఈ సమావేశానికి 26కి పైగా రాజకీయ పార్టీలకు చెందిన దాదాపు 80 మంది నేతలు హాజరుకానున్నారు. ప్రస్తుతం, 26 పార్టీలు గ్రూపులో భాగంగా ఉన్నాయి. రెండు రోజుల సమావేశంలో మరికొన్ని పార్టీలు కూటమిలో చేరబోతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Latest News