Site icon vidhaatha

దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

విధాత‌, విజ‌య‌వాడ‌: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.

అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజు కావడంతో భక్తులు దుర్గమ్మను దర్శించుకునేందుకు పోటెత్తారు. బెజవాడ దుర్గమ్మను సీఎం జగన్ ఆదివారం దర్శించుకున్నారు.

పంచెకట్టులో అమ్మవారి దర్శనానికి వచ్చిన సీఎం జగన్ కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ఆలయ చిన్నరాజగోపురం వద్ద సీఎం జగన్ తలకు పరివేష్టం చుట్టారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. సరస్వతి దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం.. అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం పలికి, అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా అంతకుముందు, దుర్గగుడిలో సీఎం జగన్‌కు మంత్రులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని కూడా స్వాగతం పలికారు. సీఎం రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Exit mobile version