Site icon vidhaatha

TSPSC | పేపర్ లీకేజీపై.. CM KCR ఉన్నతస్థాయి సమీక్ష

విధాత‌: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష స‌మావేశం జ‌రుగుతుంది. సీఎం కేసీఆర్‌తో టీఎస్‌పీఎస్సీ (TSPSC) ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌, సీఎస్‌ శాంతికుమారి, మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సీఎంవో అధికారి నర్సింగ రావు ఇతర అధికారులు సమావేశమయ్యారు.

పేపర్‌ లీకేజీ, పరీక్షల నిర్వహణ, తదుపరి కార్యాచరణపై ఈ భేటీలో చర్చించున్నారు. లీకేజీ వ్యవహారంలో సిట్‌ ప్రాథమిక నివేదిక, సర్వీస్‌ కమిషన్‌ అంతర్గత సమాచారం ఆధారంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేసింది. దీంతో ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

ఎందుకంటే దీనిపై ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు సర్వీస్‌ కమిషన్‌ పూర్తిగా ప్రక్షాళన చేయాలని, ఛైర్మన్‌ సహా సభ్యులు వైదొలగాలని, ఈ లీకేజీ వ్యవహారంలో అధికార పార్టీ పెద్దల వ్యవహారం ఉన్నదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం.

Exit mobile version