మంత్రి త‌ల‌సానిపై సీఎం కేసీఆర్ ప్ర‌శంస‌లు

విధాత : రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న గాంధీ ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో 16 ఫీట్ల అడుగు ఎత్తులో మ‌హాత్ముడి విగ్ర‌హాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్క‌రించారు. అనంత‌రం కేసీఆర్ మాట్లాడుతూ.. చాలా సంతోషం. శ్రీనివాస్ యాద‌వ్ ఒక చ‌క్క‌టి కార్య‌క్ర‌మాన్ని తీసుకున్నారు. గాంధీ ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో మ‌హాత్ముని విగ్ర‌హాన్ని ఇంత గొప్ప‌గా, 16 ఫీట్ల ఎత్తులో ప్ర‌తిష్టింప జేయ‌డ‌మ‌నేది చాలా చాలా గొప్ప విష‌యం. శ్రీనివాస్ […]

  • Publish Date - October 2, 2022 / 07:05 AM IST

విధాత : రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న గాంధీ ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో 16 ఫీట్ల అడుగు ఎత్తులో మ‌హాత్ముడి విగ్ర‌హాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్క‌రించారు. అనంత‌రం కేసీఆర్ మాట్లాడుతూ.. చాలా సంతోషం. శ్రీనివాస్ యాద‌వ్ ఒక చ‌క్క‌టి కార్య‌క్ర‌మాన్ని తీసుకున్నారు. గాంధీ ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో మ‌హాత్ముని విగ్ర‌హాన్ని ఇంత గొప్ప‌గా, 16 ఫీట్ల ఎత్తులో ప్ర‌తిష్టింప జేయ‌డ‌మ‌నేది చాలా చాలా గొప్ప విష‌యం.

శ్రీనివాస్ యాద‌వ్ సంస్కారానికి, వారి మిత్ర బృందానికి చిర‌స్థాయిగా కీర్తి ద‌క్కుతుంద‌ని మంత్రిని అభినందిస్తున్నాను. వారు ఎంచుకున్న స్థ‌లం కూడా చాలా గొప్ప‌ది. అది గాంధీ హాస్పిట‌ల్ కావ‌డం విశేషం. క‌రోనా మ‌హ‌మ్మారి యావ‌త్ ప్ర‌పంచాన్ని ద‌డ‌ద‌డలాడించే సంద‌ర్భంలో అనేక మంది ప్రాణాల‌ను కాపాడిన సంస్థ మ‌న గాంధీ హాస్పిట‌ల్. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ఈ గాంధీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసిన త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌కు మ‌రోసారి అభినంద‌న‌లు తెలుపుతున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.

Latest News