Site icon vidhaatha

CM KCR | రేపు కరీంనగ‌ర్‌కు సీఎం కేసీఆర్

విధాత, కరీంనగర్ బ్యూరో: సీఎం కేసీఆర్ (CM KCR) బుధవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. అకాల వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న పంటలను సీఎం క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించ‌నున్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని లక్ష్మీపూర్, చిప్పకుర్తి గ్రామాలలో తీవ్ర పంటనష్టం జరిగింది. ఈ గ్రామాల్లో
సీఎం పర్యటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మంగళవారం చొప్పదండి నియోజకవర్గం రామగుండం మండలం లక్ష్మీపూర్, చొప్పదండిలో అకాల వర్షాల వల్ల పంట నష్టాలను పరిశీలిస్తున్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్,జిల్లా కలెక్టర్ R.V. కర్ణన్ , చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ జిల్లా అధికారులు.

Exit mobile version