Site icon vidhaatha

యాదగిరిగుట్ట: CM KCR రాక.. స్వచ్ఛంద బంద్‌తో దుకాణాదారుల నిరసన

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు మంగళవారం నిర్వహించే కళ్యాణోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. అయితే గుట్టలోని దుకాణదారులు కేసీఆర్ రాక సందర్భంగా తమ సమస్యలపై దుకాణాల స్వచ్ఛంద బంద్‌ను చేపట్టాలని నిర్ణయించుకున్నారు.

ఇందుకు ప్రతి దుకాణానికి ఒక ఫ్లెక్సీ చొప్పున ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానంగా వ్యాపారాలకు అనుగుణంగా యాదగిరిగుట్ట బస్టాండ్‌ను యథాతధంగా కొనసాగించాలని, దేవస్థానం, అనుబంధ విభాగాల్లో ఉద్యోగాలను స్థానికులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దుకాణాల స్వచ్ఛంద బంద్ కు సిద్ధమయ్యారు.

Exit mobile version