- అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | విధాత: బీజేపీ, బీఆరెస్ పార్టీలది పెవికాల్ బంధం అని స్పష్టంగా అర్థమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్ తనను అడిగారని తెలంగాణ పర్యటనలో ప్రధాని మోడీ స్పష్టంగా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందేనన్నారు. మీ పార్టీ అంతర్గత విషయాలకు కూడా మోదీ అనుమతి అడిగారంటే మీది ఫెవికాల్ బంధం అని స్పష్టమవుతుందన్నారు. బీఆరెస్, బీజేపీలు ఒకే ఆలోచనతో కలిసి ప్రభుత్వాలను నడిపాయన్నారు.