Site icon vidhaatha

CM Revanth | ఆన్‌లైన్ ద్వారా సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం

CM Revanth | విధాత‌: మేడారం స‌మ్మ‌క్క‌- సార‌ల‌మ్మ‌ల‌కు ఆన్‌లైన్‌లో నిలువెత్తు బంగారాన్ని స‌మ‌ర్పించే కార్య‌క్ర‌మాన్ని శుక్ర‌వారం అసెంబ్లీ హాల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి త‌న స‌హ‌చ‌ర మంత్రులు సీత‌క్క‌, కొండాసురేఖ‌, దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మ‌, పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్‌ల‌తో క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆన్‌లైన్‌లో తన మనవడు రియాన్ష్ నిలువెత్తు బంగారం సమర్పించారు.


అలాగే మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ఆన్‌లైన్‌లో తన మనవరాలి నిలువెత్తు బంగారం సమర్పించారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం అమ్మవార్లకు ఆన్‌లైన్‌లోనే నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం మొద‌టి సారి కల్పించింది. ఈ కార్య‌క్ర‌మంలో సీఎస్ శాంతి కుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ త‌దిత‌ర అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version