Site icon vidhaatha

నర్సుల మీద కామెంట్స్.. క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ

విధాత‌, సినిమా: బాలయ్య బాబు మళ్ళీ నోటికి పని చెప్పాడు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడడానికి లైసెన్సిగా మారిన బాలయ్య ఈసారి నర్సుల మీద చిల్లర కామెంట్స్ చేసాడు. తనకు చేయి విరిగినపుడు ఆస్పత్రిలో అందమైన నర్సులు చికిత్స చేసారని చెబుతూ తన వాక్చాతుర్యానికి తానే మురిసిపోయాడు బాలయ్య బాబు. అలా ఆన్ స్టాపబుల్ కార్యక్రమంలో బాలయ్య నర్సుల మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. తన సినిమాల్లో మాత్రం మహిళలను అమితంగా గౌరవించేలా సీన్లు ఉండేలా చూసుకునే బాలయ్య బయట మాత్రం మహిళలను చిన్నచూపు చూస్తూ కామెంట్స్ పెడుతుంటారు.

గతంలో ఓ సినిమా కార్యక్రమంలో మాట్లాడుతూ అమ్మాయి కనిపిస్తే కడుపైనా చెయ్యాలి.. ముద్దైనా పెట్టాలి అన్నారు. ఇంకా ఆమధ్య అక్కినేని.. తొక్కినేని . ఆ రంగారావు ఈ రంగారావు అంటూ ప్రముఖులను అవహేళన చేశారు. ఆ కామెంట్స్ మీద జనాల్లో విమర్శలు రావడంతో సర్దుకునే క్రమంలో తనకు అక్కినేనికి మధ్య అత్యంత ఆత్మీయ బంధం ఉండేదని, అక్కనేనికి ఆయన ఇంట్లో దక్కని అనురాగం తన దగ్గరే దొరికేదని, అక్కినేనిని తాను బాబాయ్ అని పిలిచేవాడినని అన్నారు.

ఈ క్రమంలో అక్కినేనికి ఇంట్లో ఆత్మీయత కొరవడింది.. నాగార్జున పట్టించుకునేవాడు కాదు అన్నట్లుగా మాట్లాడారు. మళ్ళీ ఇదో గొడవకు దారితీసింది. ఇప్పుడు తాజాగా నర్సుల మీద చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో నర్సులను అవమానించేలా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఈ క్రమంలో ఆయన ఓ కామెంట్ పోస్ట్ చేసారు. నర్సుల సేవలు నిరూపమానమని అన్నారు.

తన వ్యాఖ్యలు బాధిస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ముందు నోటికొచ్చినట్లు వాగడం.. తరువాత నాలుక కర్చుకోవడం బాలయ్య బాబుకు వెన్నతో పెట్టిన విద్య.. ఇది ఆయన నోటి దురుసు తనానికి మరో ఉదాహరణ అమీ అంటున్నారు. అరవై దాటినా.. ఇన్ని సినిమాలు చేసినా ఆమాత్రం ఇంగితం లేకపోతే ఎలా,నోటిని అదుపు చేసుకోకపోతే ఎలా అని అంటున్నారు.

Exit mobile version