Site icon vidhaatha

దేశంలో సమగ్ర వ్యవసాయ విధానం రావాలి: మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

విధాత, మెదక్ బ్యూరో: ఒక సమగ్రమైన వ్యవసాయ విధానం భారతదేశంలో రావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సీఎం కేసీఆర్ అధ్వర్యంలో 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు, రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి సరిపడ సాగు నీరు ఇస్తున్నామని చెప్పారు.

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడలో నెలకొల్పిన అక్షయ అగ్రి హార్వెస్టర్ల తయారీ పరిశ్రమను అటవీ శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. తయారు చేసిన యంత్రాలను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక ఆధునిక విధానాలతో తెలంగాణ వ్యవసాయ రంగం ముందుకు వెళ్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పెద్దపీట వేశారని తెలిపారు.

దేశంలో పండిన పంటలను ప్రపంచ మార్కెట్లో విక్రయించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ప్రత్యేక అధునిక పరికరాలతో రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం జగరకుండా అధునుక టెక్నాలజీతో ముందుకు వెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో 90 శాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారన్నారు.

రాష్ట్రంలో 20 ఎకరాలు, ఆపై ఉన్న రైతులు కేవలం 22 వేలు మాత్రమే అని తెలిపారు. చిన్న, సన్న కారు రైతులు వ్యవసాయ రంగంలో తక్కువ ఖర్చు, తక్కువ సమయంతో అత్యధికంగా దిగుబడి పొందడానికి ఆధునీకరణ పద్ధతిలో వ్యవసాయం సాగు చేసుకోవాలని, ఇందుకోసం ఇలాంటి మెరుగైన యంత్రాలు అవసరమని గుర్తు చేశారు. వరికోత, ఇతర పరికరాలను అక్షయ ఆగ్రీ వారు తయారు చేసిన విధానం బాగుందని కితాబిచ్చారు. అనంతరం మంత్రి పరిశ్రమ ఆవరణలో మొక్కలు నాటారు.

Exit mobile version