Site icon vidhaatha

TSPSC: పేపర్ లీకేజీపై వరంగల్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ నిరసనలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లాలో TSPSC పేపర్ లీకేజీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ నిరనలు చేపట్టారు. కాంగ్రెస్, బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించారు.

కాజీపేటలో కాంగ్రెస్

కాజిపేట బాపుజినగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి కాజిపేట పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

కేటిఆర్ పర్యటనను అడ్డుకోవాలని పిలుపు

ఈ నెల 23న హన్మకొండలో కేటిఆర్ పర్యటనను నిరుద్యోగులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు ప్ర‌జాస్వామ్య‌ యుతంగా నిరసిస్తూ అడ్డుకోవాలని నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ TSPSC లో ప్రశ్నా పత్రాలు లీకైనట్లు పోలీసులు గుర్తించడంలో విఫలమయ్యారని విమర్శించారు. దీంతో నిరుద్యోగుల్లో నమ్మకం పోయింది.

సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ చేప‌ట్టాలి…

పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న యువత పుస్తకాలను పక్కనబెట్టి రోడ్లపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే పేపర్ లీక్ అయిందని ఆరోపించారు. లీకేజీ వ్యవహారంలో పెద్ద తలకాయలను కాపాడుకొనేందుకు చిన్న చేపలను కేటిఆర్ బలి చేస్తున్నాడని ఆరోపించారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని, మంత్రి కేటిఆర్ ఈ ఘటనకు బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో 47వ డివిజన్ అధ్య‌క్షుడు షేక్ అజ్గర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు మహమ్మద్ అంకుస్, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మేకల ఉపేందర్, MV రాజు, ఇప్పా శ్రీకాంత్, గరిగే శివ కృష్ణ, తుమ్మడి మానస మధు, గాజుల విజయ్, సంగాల ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ములుగు కలెక్టరేట్ వద్ద నిరసన

పేపర్ లీకేజీ వెనుకాల ఉన్న వారిని శిక్షించాలని కోరుతూ ములుగు కలెక్టర్ కార్యాలయం ఎదుట యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యములో నిరసన వ్యక్తం చేశారు. దోషులను శిక్షించాలని కోరుతూ ధర్నా అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవి చందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్‌లో వెలుగులోకి వస్తున్న పేపర్ లీకేజీ కుంభకోణం వల్ల నేడు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు తమ విలువైన సమయాన్ని కోల్పోయారని అందుకు కారణమైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ ఛైర్మన్ ను వెంటనే విధుల నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా నైతిక బాధ్యత వహిస్తూ కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలని రవి చందర్ డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, మత్స్య శాఖ జిల్లా అధ్యక్షుడు కంబాల రవి, ములుగు మండల అధ్యక్షుడు చాంద్ పాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుతోట చంద్రమౌళి, కాన్నయి గూడెం మండల అధ్యక్షుడు అప్సర్ పాషా, nsui జిల్లా అధ్యక్షుడు కోటి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగరాజు, జిల్లా అధికార ప్రతినిధి సుమన్ రెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి అంగోత్ వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌లో బీజేపీ నిరసన

వరంగల్ పోచంమైదాన్ సెంటర్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన దీక్ష నిర్వహించారు. కేబినెట్ నుండి కేటీఆర్ ను వెంటనే బర్తరఫ్ చేయాలనీ, పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులు ఎవరు ఉన్నా కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు. T S P S C పరీక్షలు రాసిన నిరుద్యోగులకు లక్ష రూపాయలు మంజూరు చేయాలని కార్యక్రమంలో ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో వరంగల్ తూర్పు బిజెపి నాయకుడు, వరంగల్ అర్బన్ కోపెరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కుసుమ సతీష్, గంటా రవి కుమార్ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Exit mobile version