- భట్టి విక్రమార్క నేతృత్వంలో భారీ బహిరంగ సభ.
- హాజరుకానున్న ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే.
- భారీ జన సమీకరణకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు.
- ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఠాక్రే
విధాత: కాంగ్రెస్ (Congress) సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రం నస్పూర్ కలెక్టరేట్ సమీపంలో నిర్వహిస్తున్న సత్యాగ్రహ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లక్ష మంది లక్ష్యంతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభకు దాదాపు 30 వేల మంది మహిళలు వస్తారని కాంగ్రెస్ శ్రేణులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు సత్యాగ్రహ సభ ప్రారంభం కానుంది.
మూడు రంగుల జెండాలు, స్వాగత హోర్డింగులతో మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు నస్పూర్ సత్యాగ్రహ బహిరంగ సభ సుందరంగా ముస్తాబైనది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా నస్పూర్ పాదయాత్ర శిబిరం వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నస్పూర్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ నుంచి పాదయాత్ర ప్రారంభించి బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఈరోజు సాయంత్రం 5 గంటలకు మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
Hon. Congress President Shri @kharge is in Telangana to inaugurate the ‘Jai Bharath Satyagraha Sabha’ and address the public in Naspur.
Stay tuned to:
Insta: https://t.co/dHO7fsfJ2M pic.twitter.com/TVq7ac3WtE
— Congress (@INCIndia) April 14, 2023
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హెలిప్యాడ్ వద్ద ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ నాయకులు ఘనంగా స్వాగతం పలకనున్నారు. సత్యాగ్రహ సభకు ప్రజా యుద్ధనౌక గద్దర్ హాజరుకానున్నారు. కళాకారులతో ధూం-ధాం, ఆట-పాట, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇప్పటికే మంచిర్యాలకు చేరుకున్న ఏఐసీసీ సెక్రెటరీ తెలంగాణ ఇన్చార్జ్ మానిక్ రావు ఠాక్రే సత్యగ్రహ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.